శనివారం 04 జూలై 2020
Sports - Jul 01, 2020 , 01:05:18

‘నాడా ఇండియా’ యాప్‌ విడుదల

‘నాడా ఇండియా’ యాప్‌ విడుదల

ఆన్‌లైన్‌లో ఆవిష్కరించిన క్రీడా మంత్రి రిజిజు 

న్యూఢిల్లీ: నిషేధిత ఉత్ప్రేరకాలపై అథ్లెట్లకు సమగ్ర అవగాహన కల్పించేందుకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా) తీసుకొచ్చిన మొబైల్‌ యాప్‌ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడారు. దేశంలో క్రీడలను పూర్తిగా మచ్చలేని విధంగా మార్చేందుకు జరుగుతున్న క్రమ ంలో ఇదో ముందడుగు. డోపింగ్‌కు సంబంధించి అథ్లెట్లకు పూర్తి సమాచారం అందించడంతో పాటు వేటిని వాడవద్దనే అంశంపై అవగాహన కల్పించడం ఈ యాప్‌ ముఖ్య ఉద్దేశం. నిషేధిత ఉత్ప్రేరకాలను వాడటం వలన కలిగే పరిణామాలను యాప్‌ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు అని కిరణ్‌  రిజిజు అన్నారు.        


logo