ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 21, 2020 , 18:10:07

IPL: అభిమానుల మనసు దోచేసిన ఈ అమ్మాయిలు ఎవరు?

 IPL: అభిమానుల మనసు దోచేసిన ఈ అమ్మాయిలు ఎవరు?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) మ్యాచ్‌లను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు  ప్రత్యక్షప్రసారం ద్వారా   వీక్షిస్తున్నారు.  మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడూ స్టాండ్స్‌లో ఉన్న అభిమానులను కూడా టీవీల్లో చూపిస్తుంటారు. గత కొన్నేండ్లుగా కొంతమంది అమ్మాయిలు తమ అభిమాన జట్టుకు మద్దతు పలుకుతూ  స్టాండ్స్‌లో సందడి చేసిన ఫొటోలు,  వీడియోలు   ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి.  తమ హావభావాలతో వీరంతా కెమెరా దృష్టిని ఆకర్షించారు.  అభిమానుల మనసు దోచేసి   సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా మిలియన్ల మంది ఫాలోవర్లను ఆకర్షించిన  అమ్మాయిల గురించి ఓసారి తెలుసుకుందాం!


దీపికా ఘోష్‌..ఐపీఎల్‌ మిస్టరీ గార్ల్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో దీపికా ఘోష్‌ అనే అమ్మాయి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రెడ్‌ టాప్‌ వేసుకొని, ఆర్‌సీబీ జెండా పట్టుకొని  బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫోర్లు లేదా సిక్సర్లు కొట్టినప్పుడల్లా స్టాండ్స్‌లో సందడి చేసింది. దీంతో ఆమె ఎవరనేదానిపై ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయగా ఆమె పేరు దీపికా ఘోష్‌ అని నెటిజన్లు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆమె కొన్ని గంటల్లోనే 130k కు పైగా అభిమానులను సొంతం చేసుకున్నది. 

 

కావేరి మారన్‌(SRH)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడుతున్న ప్రతీ మ్యాచ్‌లోనూ ఈమె కనిపిస్తుంది. ఐపీఎల్‌ వేలంలోనూ ఆమె హైదరాబాద్‌  ఫ్రాంఛైజీ ప్రతినిధులతో కలిసి ఉంటుంది.  ముత్తయ్య మురళీధరన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఫ్రాంఛైజీ అధికారులతో ఆమె నిరంతరం చర్చలు జరుపుతూనే ఉంటారు.  ఆమె ఎవరు అని చాలా మంది ఆశ్చర్యపోయారు.  సన్‌ మ్యూజిక్‌, సన్‌టీవీకి చెందిన ఎఫ్‌ఎం ఛానెళ్ల కార్యకలాపాలను ఆమె చూసుకుంటున్నది.      సన్‌టీవీ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా  కావేరీ మారన్‌ ఉన్నారు. ఆమె కూతురే కవియా మారన్‌.  2013 నుంచి ఫ్రాంఛైజీ వ్యవహారాలను కవియా చూసుకుంటున్నారు. 


మాలతీ చాహర్‌

ఈ అమ్మాయి మొదటిసారి 2018 ఐపీఎల్‌ సీజన్‌లో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈమె పేరు మాలతి చాహర్‌. చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ వీరాభిమాని. తన అధికారికి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ధోనికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తుంటారు. మాలతీ ఇద్దరు సోదరులు ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. దీపక్‌ చాహర్‌ చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాహుల్‌ చాహర్‌ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. 


అదితి హండియా 

2019 ఐపీఎల్‌ ఫైనల్‌లో చెన్నైపై ముంబై జట్టు ఒక పరుగు తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు  ఉత్కంఠభరితంగా సాగిన పోరు ఐపీఎల్‌ చరిత్రలోనే ఈ ఫైనల్‌ హైలెట్‌గా నిలిచింది. ఈ మ్యా్‌చ్‌ సమయంలో స్టేడియంలో ఓ అమ్మాయి చాలా టెన్షన్‌గా, సందడి చేస్తూ కనిపించింది. ఇంతకీ  ఆ బ్యూటీఫుల్‌ గార్ల్‌  ఎవరూ అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు వెతకడం మొదలెట్టారు. ఆమెపేరు అదితి హండియా అని కనిపెట్టారు. ఆమె పేరు తెలిసిన గంటల్లోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌  ఖాతాను 100k మందికి పైగా అనుసరించారు.  ఆమె ప్రొఫైల్‌ను పరిశీలిస్తే ఆమె ధోనీ, విరాట్‌ కోహ్లీ అభిమాని అని తెలుస్తున్నది. 


రియానా లల్వాణీ

గత ఆదివారం ముంబై, పంజాబ్‌ జట్ల మధ్య రెండు సూపర్‌ ఓవర్లు జరిగిన విషయం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన పోరులో   పంజాబ్‌ గెలుపొందింది.  పంజాబ్‌ ఛేదనలో చివరి ఓవర్‌లో ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది.  స్టాండ్స్‌లో మ్యాచ్‌ చూస్తూ టెన్షన్‌తో గోళ్లు కొరుకుతున్న ఆమె ఫొటో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇంతకీ ఆ సూపర్‌ గార్ల్‌ ఎవరని నెటిజన్లు సెర్చ్‌ చేయగా ఆమె పేరు రియానా లాల్వాణి అని కనిపెట్టారు. దుబాయ్‌కి చెందిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో దట్‌ సూపర్‌ ఓవర్‌ గార్ల్‌ అని ట్యాగ్‌ కూడా చేసింది. ఇన్‌స్టాలో ఇప్పటి వరకు 11పోస్టులు మాత్రమే చేసింది. ఆమెకు 61వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.