ఆదివారం 24 జనవరి 2021
Sports - Nov 26, 2020 , 09:37:50

నా హీరో ఇక లేరు.. గంగూలీ భావోద్వేగం

నా హీరో ఇక లేరు.. గంగూలీ భావోద్వేగం

హైద‌రాబాద్ :  ఫుట్‌బాల్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ డీగో మార‌డోనా క‌న్నుమూశారు.  అర్జెంటీనా ప్లేయ‌ర్ మృతి ప‌ట్ల .. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీ నివాళి అర్పించారు.  త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో భావోద్వేగ పోస్టు చేశారు.  నా హీరో ఇక లేరు.. నాకు పిచ్చిగా న‌చ్చిన ఆట‌గాడికి వీడ్కోలు ప‌లుకుతున్నా.. నీ కోస‌మే నేను ఫుట్‌బాల్ చూసేవాడిన‌ని సౌర‌వ్ త‌న పోస్టులో రాశారు. ఫుట్‌బాల్ ఆట‌లో గొప్ప క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన డీగో మార‌డోనా.. బుధ‌వారం గుండెపోటుతో మృతిచెందాడు.  అత‌ని మృతి క్రీడాలోకాన్ని తీవ్ర దుఖంలోకి ముంచేసింది. బీసీసీఐ అధ్య‌క్షుడు, మాజీ క్రికెట‌ర్ గంగూలీ.. మార‌డోనాతో క‌లిసి దిగిన ఓ ఫోటోను కూడా త‌న ట్వీట్‌లో షేర్ చేశారు. 

మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా మార‌డోనా మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు.  త‌న ట్వీట్‌లో నివాళి అర్పించిన స‌చిన్‌..  ఫుట్‌బాల్‌తో పాటు యావ‌త్ క్రీడాలోకం ఓ మేటి ఆట‌గాడిని కోల్పోయింద‌న్నారు.  రెస్ట్ ఇన్ పీస్ మార‌డోనా. మేం నిన్ను మిస్ అవుతున్నామ‌ని స‌చిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  


logo