బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 26, 2020 , 20:19:45

నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది.. పోస్టులను పట్టించుకోకండి

నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది.. పోస్టులను పట్టించుకోకండి

హైదరాబాద్: ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ నైనా జైశ్వాల్ తన వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతా  రెండు రోజులు క్రితం హ్యాక్ అయ్యిందని  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నైనా మీడియాతో మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్ బుక్ హ్యాక్ చేసి, అనవసరపు పోస్ట్ లు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంటగంటకు కొత్త పోస్ట్ లు పెడుతున్నారని నైనా విచారం వ్యక్తం చేశారు. నా ఫేస్ బుక్  అకౌంట్ హ్యాక్  అయినట్లు  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు  చేశానని నైనా జైశ్వాల్ తెలిపారు. పోలీసులు విచారణ చేసి, హ్యాకర్లపై  చర్యలు తీసుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. హ్యాకర్లకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి 10 రోజులు సమయం పడుతుందని పోలీసులు తెలిపారని నైనా అన్నారు. నా ఫేస్ బుక్ అనుసరించే వారు దేశ, విదేశాల్లో లక్షల్లో ఉన్నారనీ.. ఆలోపు ఏవైనా సంఘ విద్రోహ వీడియోలు, అభ్యూస్ వీడియోలు పోస్ట్ చేస్తారేమోనని భయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నా ఫేస్ బుక్ హ్యాక్ చేయడం తో పాటు, తనను అడ్మిన్ నుంచి తొలగించి  హ్యాక్ చేసిన వ్యక్తి అడ్మిన్ అయ్యాడనీ.. నా ఓనర్ షిప్ మొత్తం లాగేసుకున్నాడనీ నైనా తెలిపారు. 2 రోజుల నుంచి చాలా బాధగా, భయంగా గడుపుతున్నట్లు నైనా తెలిపారు. ఫేస్ బుక్ పోస్ట్ ల గురించి చాలా మంది కాల్స్, మెసేజ్ లు చేస్తున్నారనీ.. ఇకపై నా ఫేస్ బుక్ అకౌంట్ లో వచ్చే పోస్ట్ లు నమ్మకండనీ ఆమె తన ఫాలోవర్లకు విన్నవించారు. అకౌంట్ తన  కంట్రోల్ లోకి వచ్చిన తరువాత అన్ని విషయాలు షేర్ చేసుకుంటానని నైనా ఈ సందర్భంగా  తెలిపారు. పోలీసులు త్వరగా హ్యాకర్లను గుర్తించి, తనకు విముక్తి కలిగించాలని నైనా కోరారు.

కాగా, నైనా టేబుల్ టెన్నిస్ లో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. బాల మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నైనా జైస్వాల్.. 17 ఏళ్లకే పీ హెచ్ డీ పూర్తి చేశారు. నైనాకు చాలా భాషల్లో ప్రావీణ్యం ఉంది. మోటివేషన్ స్పీకర్ గానూ నైనా చాలా మందిలో భవిష్యత్ పై స్ఫూర్తి కలిగించారు.


logo
>>>>>>