మంగళవారం 07 జూలై 2020
Sports - May 29, 2020 , 22:39:49

బరిలో దిగేందుకు ముర్రే సిద్ధం

బరిలో దిగేందుకు ముర్రే సిద్ధం

లండన్‌: ప్రపంచ మాజీ నంబర్‌వన్‌, బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రే తిరిగి కోర్టులో అడుగు పెట్టనున్నాడు. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డ తరుణంలో.. యూకే జాతీయ ఆరోగ్య స్వచ్ఛంద సేవా సంస్థ కోసం తన సోదరుడు నిర్వహించనున్న ఓ టోర్నీలో ముర్రే ఆడనున్నాడు. వచ్చే నెల 23 నుంచి 28 వరకు జరిగే ఈ టోర్నీ ద్వారా లక్ష పౌండ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముర్రే సోదరుడు జామీ ముర్రే తెలిపాడు. అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఈ టోర్నీకి ప్రేక్షకులను అనుమతించేది లేదని.. ఖాళీ మైదానంలోనే మ్యాచ్‌లు జరుగుతాయని అతడు చెప్పాడు. 


logo