గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 13:24:21

India vs New Zealand: ఆక్లాండ్‌లో ఆరంభం అదుర్స్‌..

India vs New Zealand: ఆక్లాండ్‌లో ఆరంభం అదుర్స్‌..

ఈడెన్‌ పార్క్‌ మైదానంలో భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ చాలా వేగంగా ఆడుతోంది.

ఆక్లాండ్‌: ఈడెన్‌ పార్క్‌ మైదానంలో భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ చాలా వేగంగా ఆడుతోంది. ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌(30), కోలిన్‌ మన్రో(59) ధనాధన్‌ బ్యాటింగ్‌తో మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఓపెనింగ్‌ జోడీ 80 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత ప్రధాన బౌలర్లు ఈ జోడీని కీలక సమయంలో విడదీయలేకపోయారు. శివమ్‌ దూబే బౌలింగ్‌లో  గప్తిల్‌ భారీ షాట్‌ ఆడగా బౌండరీలైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ అద్భుత క్యాచ్‌తో భారత్‌కు తొలి వికెట్‌ దక్కింది. ఈడెన్‌ పార్క్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేస్తున్నారు.  శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 12వ ఓవర్లో మన్రో.. చాహల్‌ చేతికి చిక్కాడు. 12 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ రెండు వికెట్లకు 116 పరుగులు చేసింది. ఆరంభం నుంచి భారత బౌలర్లపై విరుచుకుపడుతున్న మన్నో కెరీర్‌లో పదో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 


logo
>>>>>>