శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 22:31:01

లంక ప్రీమియర్ లీగ్​ వేలంలో భారత మాజీ పేసర్​

లంక ప్రీమియర్ లీగ్​ వేలంలో భారత మాజీ పేసర్​

లంక ప్రీమియర్ లీగ్​(ఎల్​పీఎల్​) ఆరంభ సీజన్ వేలంలో టీమ్​ఇండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్​ పేరు కూడా ఉండనుంది. అక్టోబర్​ 1న జరిగే వేలంలో మునాఫ్ సహా దాదాపు 150 మంది విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు. వెస్టిండీస్​ స్టార్లు క్రిస్ గేల్​, డారెన్ సమీ, పాకిస్థాన్ మాజీ ఆల్​రౌండర్ షాహిద్ అఫ్రిది, బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకీబుల్ హసన్​, ఇంగ్లండ్ బ్యాట్స్​మన్ రవి బొపార వేలంలో  ప్రముఖ ఆటగాళ్లుగా ఉన్నారు. ఎల్​పీఎల్ తొలి సీజన్​ నవంబర్​ 14 నుంచి డిసెంబర్​ 6వ తేదీ వరకు జరుగనుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం ఐదు జట్లు ఈ లీగ్​లో తలపడనున్నాయి. దంబుల్లా, పల్లెకెలె, హంబన్​తోట అంతర్జాతీయ స్టేడియాల్లో మ్యాచ్​లు జరుగనున్నాయి. 


logo