సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 12:06:30

IPL-13: మ‌రికాసేప‌ట్లో ముంబై ఇండియ‌న్స్‌తో SRH ఢీ

IPL-13: మ‌రికాసేప‌ట్లో ముంబై ఇండియ‌న్స్‌తో SRH ఢీ

‌షార్జా: ఐపీఎల్ సీజ‌న్-13 లో భాగంగా మ‌రికాసేప‌ట్లో దుబాయ్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో 17వ మ్యాచ్ ప్రారంభం కానున్న‌ది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శ‌ర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో వార్న‌ర్ సార‌థ్యంలోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ ఐపీఎల్‌లో రెండు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఐదేసీ మ్యాచ్‌లు ఆడి రెండేసి మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించాయి. పాయింట్ల ప‌రంగా చూస్తే నాలుగేసి పాయింట్ల‌తో స‌మంగా ఉన్న‌ప్ప‌టికీ.. నెట్ ర‌న్‌రేట్ ఆధారంగా పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు మూడో స్థానంలో, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాయి. 

కాగా, ఈ మధ్యాహ్నం 3:30 గంట‌లకు మ్యాచ్ ప్రారంభం కానున్న‌ది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రెండు జ‌ట్లు అబుదాబిలోని హోట‌ళ్ల నుంచి షార్జా క్రికెట్ స్టేడియానికి బ‌య‌లుదేరాయి.