శనివారం 16 జనవరి 2021
Sports - Dec 02, 2020 , 02:02:09

ముంబై ఏకపక్ష విజయం

ముంబై ఏకపక్ష విజయం

గోవా: ఆడం లెఫోండ్రే డబుల్‌ గోల్స్‌తో రెచ్చిపోవడంతో ముంబై ఎఫ్‌సీ జట్టు ఏకపక్ష విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరింది. ఐఎస్‌ఎల్‌ ఏడో సీజన్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై 3-0 తేడాతో ఈస్ట్‌ బెంగాల్‌పై విజయం సాధించింది. 20వ నిమిషంలో గోల్‌ చేసి ఖాతా తెరిచిన లెఫోండ్రే.. ఆ తర్వాత(48వ ని.) పెనాల్టీ సద్వినియోగం చేసుకొని ముంబై ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఆ తర్వాత పది నిమిషాలకే హెర్నన్‌ సాంటన గోల్‌ బాదడంతో ముంబైకి తిరుగులేకుండా పోయింది. మ్యాచ్‌ మొత్తం డిఫెన్స్‌కే పరిమితమైన ఈస్ట్‌ బెంగాల్‌ గోల్స్‌ను ఆపడంలో పూర్తిగా విఫలమై పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పరిమితమైంది.