టాపార్డర్ రాణించినా మిడిల్ ముంచడంతో భారీ స్కోరు చేయలేకపోయిన ముంబై ఇండియన్స్.. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయినా.. ఆఖర్లో విజృంభించి సీజన్లో బోణీ కొట్టింది. కోల్‌కతా హిట్టర్లను అడ్డుకోవడంలో బుమ్రా బ్యాచ్ సఫలం కావడంతో రోహిత్ సేన పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. బంతితో ఐదు వికెట్లు పడగొట్టిన డేంజర్ మ్యాన్ రస్సెల్ బ్యాట్‌తో భారీ షాట్లు కొట్టలేకపోవడం కోల్‌కతా కొంపముంచింది.
చెన్నై: బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట బౌలర్లు విజృంభించడంతో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన పోరులో ఆఖర్లో బౌలర్లు సత్తాచాటడంతో ముంబై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. రోహిత్ శర్మ (43) రాణించాడు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. నితీశ్ రాణా (47 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ‘మ్యా న్ ఆఫ్ ది మ్యాచ్’ రాహుల్ చాహర్ 4, బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు.
ముంబై ఇండియన్స్ రెండో మ్యాచ్‌లో విజృంభించింది. డికాక్ (2) త్వరగా ఔటై నా.. వన్‌డౌన్ లోవ చ్చిన సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడగా.. అతడికి కెప్టెన్ రోహిత్ శర్మ చక్కటి సహకారం అందించాడు. మూడో ఓవర్లో సూర్యకుమార్ మూడు ఫోర్లు బాదడంతో.. పవర్ ప్లే ముగిసే సరికి ముంబై 42/1తో మంచి స్థితిలో నిలిచింది. ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్లో సూర్యకుమార్ 6,4,4 కొట్టడంతో ముంబై ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చిం ది. 33 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సూర్య కాసేపటికే ఔట్ కాగా.. అక్కడి నుంచి ముంబై ఇన్నింగ్స్ తడబడింది. ఇషాన్ కిషన్ (1) ఆకట్టుకోలేకపోగా.. ఆ తర్వాత రోహి త్ ఔటయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (15), పొలార్డ్ (5), జానెసన్ (0) ధాటిగా ఆడేందుకు యత్నిం చి వికెట్లు సమర్పించుకున్నారు. 18వ ఓవర్‌తో పాటు చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రస్సెల్ 15 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం.
ముంబై: రోహిత్ (బి) కమిన్స్ 43, డికాక్ (సి) త్రిపాఠి (బి) వరుణ్ 2, సూర్యకుమార్ (సి) గిల్ (బి) షకీబ్ 56, కిషన్ (సి) కృష్ణ (బి) కమిన్స్ 1, హార్దిక్ (సి) రస్సెల్ (బి) కృష్ణ 15, పొలార్డ్ (సి) కార్తీక్ (బి) రస్సెల్ 5, కృనాల్ (సి) కృష్ణ (బి) రస్సెల్ 15, జాన్సెన్ (సి) కమిన్స్ (బి) రస్సెల్ 15, రాహుల్ చాహర్ (సి) గిల్ (బి) రస్సెల్ 8, బుమరా (సి) షకీబ్ (బి) రస్సెల్ 0, బౌల్ట్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 152 ఆలౌట్. వికెట్ల పతనం: 1-10, 2-86, 3-88, 4-115, 5-123, 6-125, 7-126, 8-150, 9-150, 10-152, బౌలింగ్: హర్భజన్ 2-0-17-0,వరుణ్ 4-0-27-1, షకీబ్ 4-0-23-1,కమిన్స్ 4-0-24-2, ప్రసిద్ధ్ కృష్ణ 4-0-42-1, రస్సెల్ 2-0-15-5.
కోల్‌కతా: రాణా (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చాహర్ 57, గిల్ (సి) పొలార్డ్ (బి) రాహుల్ చాహర్ 33, రాహుల్ త్రిపాఠి (సి) డికాక్ (బి) రాహుల్ చాహర్ 5, మోర్గాన్ (సి) జాన్సెన్ (బి) రాహుల్ చాహర్ 7, షకీబ్ (సి) సూర్య (బి) కృనాల్ 9, కార్తీక్ (నాటౌట్) 8, రస్సెల్ (సి) బి బౌల్ట్ 9, కమిన్స్ (బి) బౌల్ట్ 0, హర్భజన్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 142/7. వికెట్ల పతనం: 1-72, 2-84, 3-104, 4-122, 5-122, 6-140, 7-140, బౌలింగ్: బౌల్ట్ 4-0-27-2, జానెసన్ 2-0-17-0, బుమ్రా 4-0-28-0, కృనాల్ 4-0-13-1, పొలార్డ్ 1-0-12-0, రాహుల్ చాహర్ 4-0-27-4, రోహిత్ 1-0-9-0.
ఓ మోస్తరు లక్ష్యఛేదనలో కోల్‌కతాకు శుభారంభం దక్కింది. యువ ఆటగాళ్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టారు. ఇన్నింగ్స్ మొదటి బంతికే బౌండ్రీతో తన ఉద్దేశం చాటిన రాణా.. బౌల్ట్ ఓవర్లో 6,4 అరుసుకున్నాడు. గిల్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లే ముగిసేసరికి కోల్‌కతా 45 పరుగులు చేసింది. ఇదే జోరులో రాణా అర్ధశతకం పూర్తి చేసుకోగా.. గిల్‌తో పాటు రాహుల్ త్రిపాఠి (5), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7), షకీబ్ అల్ హసన్ (7) ఔటయ్యారు. ఈ నాలుగు వికెట్లు రాహుల్ చాహర్ ఖాతాలోకే వెళ్లడం విశేషం. 18 బంతు ల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో కార్తీక్ (8 నాటౌట్), రస్సెల్ (9) భారీ షాట్లు ఆడలేకపోయారు. ఆరంభంలో విఫలమైన ముంబై బౌల ర్లు ఆఖర్లో కట్టుదిట్టమైన బంతులతో కోల్‌కతా హిట్టర్లను అడ్డుకున్నారు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమవగా.. 4 పరుగులే ఇచ్చిన బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు.
జట్టు ఆ- గె- ఓ- నె,ర- పా
ఢిల్లీ 1- 1- 0- 0.77- 2
ముంబై 2- 1- 1- 0.25- 2
పంజాబ్ 1- 1- 0- 0.20- 2
బెంగళూరు 1- 1- 0- 0.05- 2
కోల్‌కతా 2- 1- 1- 0.00- 2
రాజస్థాన్ 1- 0- 1- -0.20- 0
హైదరాబాద్ 1- 0- 1- -0.50- 0
చెన్నై 1- 0- 1- -0.77- 0