గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 05, 2020 , 20:37:47

వెనువెంటనే రెండు వికెట్లు ..పొలార్డ్‌ డకౌట్‌

వెనువెంటనే రెండు వికెట్లు ..పొలార్డ్‌ డకౌట్‌

దుబాయ్:‌ ఐపీఎల్‌-13 క్వాలిఫయర్‌-1లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న  ముంబై ఇండియన్స్‌  జోరుగా బ్యాటింగ్‌ చేస్తోంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌(51) అర్ధశతకంతో చెలరేగాడు.  నోర్ట్జే వేసిన 12వ ఓవర్‌ మూడో బంతికి ఫోర్‌ బాదిన సూర్యకుమార్‌ 36 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌ ఐదో  బంతికి భారీ షాట్‌ ఆడి ఔటయ్యాడు.   

ముంబై ఇన్నింగ్స్‌ జోరుగా సాగుతున్న సమయంలో నోర్ట్జే.. సూర్య కుమార్‌ను పెవిలియన్‌కు పంపి స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశాడు.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌ డకౌటయ్యాడు. అశ్విన్‌ వేసిన తర్వాతి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. 13 ఓవర్లకు ముంబై 4 వికెట్లకు 103 పరుగులు చేసింది.   ఇషాన్‌ కిషన్‌(8), కృనాల్‌ పాండ్య(1) క్రీజులో ఉన్నారు.