మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 03, 2020 , 02:21:57

ముంబై ఇండియన్స్‌ సన్‌రైజర్స్‌ ఢీ

ముంబై ఇండియన్స్‌ సన్‌రైజర్స్‌ ఢీ

నేడు ముంబైపై గెలిస్తే ప్లేఆఫ్స్‌కు..

షార్జా: ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) హైదరాబాద్‌ సిద్ధమైంది. ఐపీఎల్‌ 13వ సీజన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో మంగళవారం ముంబైతో హైదరాబాద్‌ తలపడనుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు గెలిచి మంచి నెట్న్‌ రేట్‌తో ఉన్న వార్నర్‌సేన.. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన ముంబైను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే కోల్‌కతాకు మార్గం సుగమమవుతుంది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ జోరుమీద ఉంది. బెయిర్‌స్టోను పక్కనపెట్టిన తర్వాత జట్టు సమతూకంతో కనిపిస్తున్నది. అతడి స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ అదరగొడుతుండగా.. వృద్ధిమాన్‌ సాహా మెరుగ్గా ఆడుతున్నాడు. మరోవైపు స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌తో పాటు పేసర్లు సందీప్‌ శర్మ, నటరాజన్‌ రాణిస్తుండడం హైదరాబాద్‌కు సానుకూలాంశం. కాగా చాంపియన్‌గా అవతరించిన 2016లోనూ హైదరాబాద్‌ తప్పకగెలువాల్సిన చివరి మూడు మ్యాచ్‌ల్లో సత్తాచాటి ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.