గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 11, 2020 , 02:40:15

ముంబై మురిపెం

ముంబై మురిపెం

  • దమ్మున్న సారథ్యం..
  • డబ్బున్న యాజమాన్యం.. 
  • బెంబేలెత్తించే బౌలింగ్‌ దళం.. 
  • దడ పుట్టించే బ్యాటింగ్‌ సైన్యం..
  • అడుగుకొక ఆల్‌రౌండర్‌.. 
  • అత్యుత్తమ సౌకర్యాలు.. 
  • అత్యాధునిక సదుపాయాలు.. 
  • వెరసి చూస్తే ముంబై ఇండియన్స్‌

దుబాయ్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో అసలు ఈ ఏడాది ఐపీఎల్‌ జరుగుతుందా ? ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్సే వాయిదా పడ్డాయి.. ఇక ఐపీఎల్‌ గురించి మర్చిపోవాల్సిందే అనుకున్న చోటు నుంచి మరో వారం రోజుల్లో లీగ్‌ ప్రారంభమయ్యే వరకు వచ్చాం. ఆటగాళ్లు, అంపైర్లు, కామెంటేటర్లు, ఫ్రాంచైజీలు, నిర్వాహకులు.. సన్నాహాల్లో నిమగ్నమైపోయారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ బలాబలాలను పరిశీలిస్తే.. 

గత ఏడు సీజన్‌లలో నాలుగుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ చేజిక్కించుకున్నదంటే ముంబై ఇండియన్స్‌ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలో దిగుతున్న ముంబై జట్టుకు ఏ విషయంలోనూ ఇబ్బందులు లేవు. లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన సారథి రోహిత్‌ శర్మ నాయకత్వమే ముంబైకి సగం బలం. టాపార్డర్‌లో కెప్టెన్‌తో పాటు డికాక్‌, క్రిస్‌ లిన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ఉంటే.. మిడిల్‌ భారం మోసేందుకు పాండ్యా బ్రదర్స్‌ హార్దిక్‌, కృనాల్‌తో పాటు విండీస్‌ వీరుడు పొలార్డ్‌ సిద్ధంగా ఉన్నారు. 


logo