ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 25, 2020 , 19:09:11

RR vs MI: బ్యాటింగ్‌ ఎంచుకున్న పొలార్డ్‌

RR vs MI:  బ్యాటింగ్‌ ఎంచుకున్న పొలార్డ్‌

అబుదాబి: ఐపీఎల్‌-2020లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.  అబుదాబి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్‌ పొలార్డ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.  పేసర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ స్థానంలో పాటిన్సన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది.  ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ముంబై టేబుల్‌ టాప్‌లో ఉండగా..రాజస్థాన్‌ 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. గాయం కారణంగా ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.