గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 15:05:06

MI vs SRH:ముంబైతో మ్యాచ్‌కు భువీ దూరం

MI vs SRH:ముంబైతో మ్యాచ్‌కు భువీ దూరం

షార్జా: ఐపీఎల్‌-13లో ఆదివారం మధ్యాహ్నం మరో  ఆసక్తికర సమరం జరగనుంది.  ఆల్‌రౌండ్‌ షోతో అలరిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరో కీలక పోరుకు సన్నద్ధమైంది.  రోహిత్‌ శర్మ సారథ్యంలోని  ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడుతోంది.  చిన్న మైదానం, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో షార్జాలో  ఈ  మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదుకానున్నాయి. 

టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.  జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు రోహిత్‌ చెప్పాడు.  చెన్నైతో మ్యాచ్‌లో  గాయపడిన  సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నేటి మ్యాచ్‌కు దూరమైనట్లు సన్‌రైజర్స్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ చెప్పాడు. అతని స్థానంలో సందీప్‌ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. మరో పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో  సిద్ధార్థ్‌ కౌల్‌ను జట్టులోకి తీసుకున్నారు.