మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 00:33:56

యూఏఈకి విండీస్‌ ఆటగాళ్లు

యూఏఈకి విండీస్‌ ఆటగాళ్లు

అబుదాబి:  కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో అదరగొట్టిన వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం యూఏఈకి చేరుకున్నాడు. అబుదాబిలో ఉన్న ముంబై ఇండియన్స్‌ జట్టుతో పొలార్డ్‌, రూథర్‌ఫర్డ్‌ కలిశారు. ఈ ఫొటోను ముంబై ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. వారితో పాటు వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు మరికొందరు శనివారం యూఏఈలో దిగారు. కాగా పొలార్డ్‌ సారథ్యంలోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఈ ఏడాది సీపీఎల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 


logo