ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 06, 2020 , 00:20:45

టీమ్‌ ఫస్ట్‌.. కెప్టెన్‌ లాస్ట్‌: రోహిత్‌

టీమ్‌ ఫస్ట్‌.. కెప్టెన్‌ లాస్ట్‌: రోహిత్‌

 న్యూఢిల్లీ: సారథిగా జట్టులో తనకు తాను చివరి ప్రాధాన్యత ఇచ్చుకుంటానని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. బుధవారం హిట్‌మ్యాన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సూత్రాన్ని నేను బాగా నమ్ముతా. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులో మిగిలిన ఆటగాళ్లే నా కంటే ముఖ్యం. సారథులకు ఎవరి శైలి వారికి ఉంటుంది. నా వరకైతే ఈ పద్ధతి సత్ఫలితాలను ఇచ్చింది. క్రికెటర్లకూ భావోద్వేగాలు సహజం. అందరిలానే చిరాకు, కోపం వస్తాయి. కానీ కెప్టెన్‌గా వాటిని జట్టు సభ్యులకు చూపించకూడదు. వాటిని నియంత్రించుకోవడం ముఖ్యం’ అని అన్నాడు. కరోనా వైరస్‌ కారణంగా ఇంటికే పరిమితమైన రోహిత్‌.. జిమ్‌ సెంటర్లకు అనుమతి లభించడంతో ఇక ట్రైనింగ్‌పై దృష్టిపెడతానని చెప్పాడు. ముంబైలో వర్షాలు దంచికొడుతుండటంతో.. ఇండోర్‌ శిక్షణకు మొగ్గుచూపుతానన్నాడు.


logo