బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 19:30:28

MI vs SRH: సన్‌రైజర్స్‌పై ముంబై ఘనవిజయం

MI vs SRH: సన్‌రైజర్స్‌పై ముంబై ఘనవిజయం

షార్జా: రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌  ఖాతాలో  మూడో విజయం. షార్జా వేదిక జరిగిన   మ్యాచ్‌లో  ముంబై  అన్ని విభాగాల్లో సత్తాచాటి 34  పరుగుల తేడాతో   సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది.  దీంటో పాయింట్ల పట్టికలో రోహిత్‌సేన  టాప్‌లో నిలిచింది. కొండంత లక్ష్య  ఛేదనలో  హైదరాబాద్‌  20 ఓవర్లలో 7 వికెట్లకు 174  పరుగులు చేసింది. 

డేవిడ్‌ వార్నర్‌(60: 44 బంతుల్లో  5ఫోర్లు, 2సిక్సర్లు ), మనీశ్‌ పాండే(30: 19 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) పోరాడారు.  ముంబై బౌలర్ల ధాటికి మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌(3), ప్రియం గార్గ్‌(8) నిలువలేకపోయారు. ముంబై బౌలర్లలో  ట్రెంట్‌ బౌల్ట్‌(2/28), జేమ్స్‌ పాటిన్సన్‌(2/29), బుమ్రా(2/41) హైదరాబాద్‌ జట్టును కట్టడి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(67: 39 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించగా, ఆఖర్లో హార్దిక్‌ పాండ్య(28: 19 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు),  పొలార్డ్‌(25.  నాటౌట్‌:  13 బంతుల్లో 3సిక్సర్లు), కృనాల్‌ పాండ్య(20 నాటౌట్:‌ 4 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) వీరవిహారం చేశారు