మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 16:22:10

ఫుట్‌బాల్ టీమ్స్‌ను మించిపోయిన ముంబై ఇండియ‌న్స్‌

ఫుట్‌బాల్ టీమ్స్‌ను మించిపోయిన ముంబై ఇండియ‌న్స్‌

ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియ‌న్స్‌కు ఫాలోయింగ్ విప‌రీతంగా పెరిగిపోతోంది. ఈ ఏడాది కూడా టైటిల్‌తో మొత్తం ఐదు ఐపీఎల్ ట్రోఫీల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ముంబై టీమ్‌ను సోష‌ల్ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. తాజాగా ఆ టీమ్ ఫేస్‌బుక్‌లో కొత్త రికార్డుల‌ను సృష్టించింది. ఫేస్‌బుక్ పాపులారిటీలో ఫుట్‌బాల్ క్ల‌బ్స్ అయిన మాంచెస్ట‌ర్ యునైటెడ్, బార్సిలోనా, లివ‌ర్‌పూల్‌, ఆర్సెన‌ల్‌ల‌ను ముంబై మించిపోయింది. అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌ల్లో ముంబై టీమే టాప్‌లో నిల‌వ‌డం విశేషం. ఇక ఇన్‌స్టాగ్రామ్ పాపులారిటీ విష‌యానికి వ‌స్తే బార్సిలోనా, మాంచెస్ట‌ర్ యునైటెడ్ త‌ర్వాత మూడోస్థానంలో ఉంది. 

ఫ్యాన్స్‌తో క‌ల‌వ‌డానికి డిజిట‌ల్ వేదిక‌

ఇక మోస్ట్ ఎంగేజ్డ్ ఐపీఎల్ టీమ్‌గా కూడా ముంబై ఇండియ‌న్స్ నిలిచింది. ముంబై ఈ ఘ‌న‌త సాధించ‌డం వ‌రుస‌గా మూడోసారి. ఈ ఏడాది అభిమానుల‌తో నేరుగా క‌ల‌వ‌క‌పోయినా.. డిజిట‌ల్ వేదిక‌గా ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేసింది. ఎంఐ లైవ్‌, ప‌ల్టాన్ ప్లే, వ‌ర్చువ‌ల్ వాంఖెడే, ఎంఐ బ‌డ్డీలాంటి కార్య‌క్ర‌మాల‌తో అభిమానుల‌కు ఎప్పుడూ ట‌చ్‌లోనే ఉంది ఆ టీమ్‌. ముంబై ఇండియ‌న్స్ వ‌న్ ఫ్యామిలీ నినాదంలో భాగంగా ఆ టీమ్ ఈ కార్య‌క్ర‌మాల‌ను లాంచ్ చేసింది. వీటి ద్వారా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్‌లు క‌లిపి మొత్తం 31.7 కోట్ల ఇంట‌రాక్ష‌న్ల‌తో ముంబై ఇండియ‌న్స్ టాప్‌లో నిల‌వ‌గా.. ఆ త‌ర్వాతి స్థాన‌ల్లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (27.7 కోట్లు), చెన్నై సూప‌ర్ కింగ్స్ (18.9 కోట్లు) నిలిచాయి.


ఇవి కూడా చ‌ద‌వండి

వ‌య‌సు 80 ఏళ్లు.. గ్యారేజ్‌లో 80 పోర్షె కార్లు

గుప్కార్ కూట‌మి ఏంటి? ఆ పేరెలా వ‌చ్చింది?

క‌శ్మీర్‌లో గుప్కార్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ

600 డాల‌ర్లు కాదు.. ఒక్కొక్క‌రికి 2వేల డాల‌ర్లు ఇవ్వండి

రాహుల్‌గాంధీకి ఆలుగ‌డ్డ ఎట్ల పెరుగుత‌దో తెలియ‌దు: బీజేపీ