గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 05, 2020 , 19:07:55

క్వాలిఫయర్‌-1: బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

క్వాలిఫయర్‌-1: బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో  మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఐదోసారి టైటిల్‌ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌.. తొలి టైటిల్‌పై కన్నేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆసక్తికర  పోరులో   తలపడనున్నాయి.

క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరేందుకు  మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ విజేతతో జరిగే క్వాలిఫయర్‌-2లో గెలిస్తే తుదిపోరుకు చేరొచ్చు.  టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, హార్డిక్‌ పాండ్య మళ్లీ తుది జట్టులోకి వచ్చినట్లు ముంబై సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు.