శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 04, 2020 , 00:03:46

13 ఏండ్ల తర్వాత..

13 ఏండ్ల తర్వాత..
  • రంజీ ఫైనల్‌ చేరిన బెంగాల్‌

కోల్‌కతా: భారీ లక్ష్యఛేదనలో బ్యాట్స్‌మెన్‌ వైఫల్యాల బాటవీడకపోవడంతో.. కర్ణాటక ఘోర పరాజయం మూటగట్టుకుంది. బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక 174 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా 13 ఏండ్ల తర్వాత బెంగాల్‌ జట్టు ప్రతిష్ఠాత్మక టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. సౌరవ్‌ గంగూలీ అరంగేట్రం చేసిన 1989-90 సీజన్‌లో విజేతగా నిలిచిన బెంగాల్‌ జట్టు.. చివరిసారిగా 2007 ఫైనల్లో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 352 పరుగుల లక్ష్యఛేదనలో.. ఓవర్‌నైట్‌ స్కోరు 98/3తో మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక 177 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్‌  పేసర్‌ ముఖేష్‌ (6/61) అదరగొట్టాడు.


logo