సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 01:43:16

ముకేశ్‌కు రూ.42వేల కోట్ల నష్టం

ముకేశ్‌కు రూ.42వేల కోట్ల నష్టం

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ సంపద ఒక్కరోజే దాదాపు రూ.42వేల కోట్లు కరిగిపోయింది. స్టాక్‌ మార్కెట్ల భారీ నష్టాలు ముకేశ్‌ సంపదను తరిగించేశాయి. సోమవారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్‌ విలువ 12 శాతానికిపైగా పడిపోయింది. గత పదేండ్లలో ఇదే అతిపెద్ద పతనం కావడం గమనార్హం. రష్యాతో సౌదీ అరేబియా మొదలు పెట్టిన ధరల యుద్ధం.. భారత్‌లో ఆర్‌ఐఎల్‌ షేర్లను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 31 శాతం క్షీణించిన నేపథ్యంలో రిలయన్స్‌ షేర్‌ విలువ 12.35 శాతం దిగజారింది. ట్రేడింగ్‌ మొదలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ఆర్‌ఐఎల్‌ షేర్‌.. ఒకానొక దశలో రూ.1,094.95 స్థాయిని తాకింది. అయినప్పటికీ తేరుకుని చివరకు రూ.1,113.15 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.7.06 లక్షల కోట్లుగా ఉన్నది. ఇక తాజా నష్టాల మధ్య టీసీఎస్‌ మార్కెట్‌ లీడర్‌గా ఎదిగింది. ఈ సంస్థ మార్కెట్‌ విలువ రూ.7.40 లక్షల కోట్లుగా ఉన్నది. 


logo