గురువారం 09 జూలై 2020
Sports - Apr 26, 2020 , 09:53:55

న‌న్నెందుకు ప‌క్క‌న‌బెట్టారో..

న‌న్నెందుకు ప‌క్క‌న‌బెట్టారో..

జాతీయ జ‌ట్టుకు దూరం కావ‌డంపై పేస‌ర్ ఆర్పీ సింగ్‌

న్యూఢిల్లీ: మ‌ంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే త‌న‌ను జ‌ట్టు నుంచి ప‌క్క‌న పెట్టార‌ని.. కార‌ణం కూడా చెప్ప‌కుండానే టీమ్ నుంచి దూరం చేశార‌ని ఆర్పీ సింగ్ వెల్ల‌డించాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఆర్పీసింగ్‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని అంతా భావించారు. మీడియం పేస్‌తో పాటు బంతిని ఇరువైపులా స్వింగ్ చేయ‌గ‌ల ఆర్పీ.. దీర్ఘ‌కాలం పాటు దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాడ‌నుకుంటే.. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం నాలుగైదు మ్యాచ్‌లు కూడా ఆడ‌కుండానే అంత‌ర్ధానమ‌య్యాడు. జాతీయ జ‌ట్టులోకి రాక‌ముందే మ‌హేంద్ర సింగ్ ధోనీకి స్నేహితుడైన ఆర్పీసింగ్‌.. ఈ అంశంలో ధోనీని సంప్ర‌దిస్తే.. నువ్వు చేయాల్సింది చేయి.. ఆపై అదృష్టం క‌లిసొస్తే జట్టులో చోటు ల‌భిస్తుంద‌ని పేర్కొన్న‌ట్లు చెప్పాడు.

`మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలోనే జ‌ట్టుకు దూర‌మ‌య్యా. వ‌న్డేలు, టెస్టుల‌కు అస‌లు నా పేరును ప‌రిగ‌ణించ‌లేదు. ఆ స‌మ‌యంలోనే ఐపీఎల్లో వ‌రుస‌గా రెండు మూడు సీజ‌న్లు టాప్ వికెట్ టేక‌ర్‌గా నిలిచిన సెలెక్ష‌న్ క‌మిటీ నుంచి పిలుపు రాలేదు. ఈ అంశంపై వారిని సంప్ర‌దిస్తే.. నువ్వు క‌ష్ట‌ప‌డుతూ ఉండు.. త‌ప్ప‌క అవ‌కాశం వ‌స్తుంది ( రాజే తు మెహ్న‌త్ క‌ర్ తేరా వ‌ఖ్త్ జ‌రూర్ ఆయేగా) అని చెప్పారే త‌ప్ప చాన్స్ మాత్రం ఇవ్వ‌లేదు` అని ఆర్పీ సింగ్ అన్నాడు. రానురాను ధోనీ పేరు ప్ర‌ఖ్యాత‌లు పెరిగినా త‌మ స్నేహంలో ఎలాంటి మార్పు రాలేద‌ని అత‌డు చెప్పాడు.


logo