గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 16, 2020 , 16:16:07

ధోనీ టీ20 ప్రపంచకప్‌ ఆడాలనుకున్నాడు. కానీ,

ధోనీ టీ20 ప్రపంచకప్‌ ఆడాలనుకున్నాడు. కానీ,

ముంబై:  వచ్చే నెలలో యూఏఈ వేదికగా ఆరంభంకానున్న ఐపీఎల్‌-13 సీజన్‌లో ధోనీ  సత్తా నిరూపించుకుంటే మళ్లీ  భారత జట్టులోకి వస్తాడని అభిమానులుందరూ ఆశించారు కానీ, మహీ హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు.   టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం ధోనీ తన కెరీర్‌ను ముగించాలని అనుకున్నాడు. ఐతే కరోనా మహమ్మారి కారణంగా మహీ తన రిటైర్మెంట్‌ ప్లాన్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. 

ఏడాదికి పైగా ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి  అతనికి సంపూర్ణ మద్దతు ఉంది. ఐపీఎల్‌ 2020 తర్వాత మాజీ సారథి తిరిగి జట్టులోకి వస్తాడని హెచ్‌కోచ్‌ రవిశాస్త్రి కూడా చెప్పాడు. జాతీయ జట్టులోకి వచ్చేందుకు మహీకి ఎలాంటి ఇబ్బందులు లేవు.  ఐతే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడటంతో ధోనీ తన ఆలోచనను మార్చుకొని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి  తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

ధోనీ తన  వీడ్కోలు ప్లాన్‌ గురించి   తన స్నేహితులలో ఒకరితో చర్చించాడు. మహీ 2020 టీ 20 ప్రపంచ కప్  ఆడటానికి ఆసక్తి చూపించాడని సన్నిహితుడొకరు చెప్పారు.   ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచకప్‌ 2022లో జరగనుంది. logo