మంగళవారం 07 జూలై 2020
Sports - May 09, 2020 , 00:42:26

ధోనీ మళ్లీ ఆడాలి: కుల్దీప్‌

ధోనీ మళ్లీ ఆడాలి: కుల్దీప్‌

న్యూఢిల్లీ: మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీమ్‌ఇండియా తరఫున మళ్లీ ఆడాలని స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆకాంక్షించాడు. ధోనీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడని, అతడి రిటైర్మెంట్‌పై చర్చించడం అర్థరహితమని ఓ క్రికెట్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. అలాగే టీ20 ప్రపంచకప్‌ జట్టులో ధోనీ ఉంటే టీమ్‌ఇండియాకు చాలా మేలని కుల్దీప్‌ అన్నాడు. ఓ అభిమానిగా తాను మహీని ఎంతో ప్రేమిస్తానని చెప్పాడు. 


logo