గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 15:10:35

కోవిడ్ ప‌రీక్ష చేయించుకున్న ధోనీ

కోవిడ్ ప‌రీక్ష చేయించుకున్న ధోనీ

హైద‌రాబాద్‌: యూఏఈ‌లో జ‌రిగే ఐపీఎల్‌13 కోసం క్రికెట‌ర్లు స‌న్న‌ద్దం అవుతున్నారు.  చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా రెడీ అవుతున్నాడు.  అయితే బుధ‌వారం రోజున రాంచీలో ధోని కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు తెలిసింది. మ‌రో టీమ్ స‌భ్యుడు మోనూ సింగ్ కూడా ఈ ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు.  బుధ‌వారం సాయంత్రం కోవిడ్‌19 ప‌రీక్ష ఫ‌లితాలు వ‌స్తాయి.  ఒక‌వేళ కోవిడ్ ప‌రీక్ష‌లో ధోనీ నెగ‌టివ్‌గా తేలితే.. అప్పుడు అత‌ను చెన్నైకి బ‌య‌లుదేరి వెళ్లాడు. అక్క‌డ మిస్ట‌ర్ కూల్ త‌న టీమ్ స‌భ్యుల‌తో శిక్ష‌ణ‌లో పాల్గొంటాడు. చెన్నై టీమ్‌కు చెందిన ర‌వీంద్ర జ‌డేజా వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ట్రైనింగ్‌కు దూరంగా ఉన్నట్లు సీఈవో కాశి విశ్వ‌నాథ‌న్ తెలిపారు. ఆగ‌స్టు 15వ తేదీ నుచి ఆగ‌స్టు 20వ తేదీ వ‌ర‌కు ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో చెన్నై జ‌ట్టు క్యాంప్ నిర్వ‌హించ‌నున్న‌ది.  ఈ క్యాంపుకు బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీ నేతృత్వం వ‌హిస్తాడు. ఇంత బ్రేక్ త‌ర్వాత ఒకేసారి ఫిట్‌నెస్ తెచ్చుకోవ‌డం అంత సులువు కాద‌న్నాడు.  ధోనీ, రైనా, పీయూష్ చావ్లాతో పాటు మ‌రో 8 మంది త‌మిళ‌నాడు క్రికెట్లు యూఏఈ వెళ్లేందుకు సెలెక్ట్ అయ్యారు. ఎంపికైన త‌మిళ బౌల‌ర్లు నెట్స్‌లో  బౌలింగ్ చేస్తారు.  అశ్విన్ క్రిస్ట్‌, జే కౌశిక్‌, ఎం మొహ‌మ్మ‌ద్‌, ఔశిక్ శ్రీనివాస్‌, ఎల్ విఘ్నేశ్‌, అభిషేక్ త‌న్వార్‌లు ఎంపికైన‌వారిలో ఉన్నారు. ఆగ‌స్టు 21న చెన్నై జ‌ట్టు యూఏఈ బ‌య‌లుదేరుతుంది. 


logo