ఆదివారం 24 మే 2020
Sports - Feb 25, 2020 , 17:36:50

డేట్‌ ఫిక్స్‌:ధోనీ చెన్నైకి ఎప్పుడు వస్తాడంటే..

డేట్‌ ఫిక్స్‌:ధోనీ చెన్నైకి ఎప్పుడు వస్తాడంటే..

మార్చి 29న చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభంకానుంది.

చెన్నై:  గతేడాది జులైలో వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ఓటమి తర్వాత టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పటి వరకు మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఆటకు సుధీర్ఘ విరామం తీసుకున్న ధోనీ త్వరలోనే బ్యాట్‌ పట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. మార్చి 29 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంఛైజీలన్నీ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇప్పటికే శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌  మహీ మార్చి 2 నుంచి సహచర ఆటగాళ్లతో కలిసి ట్రైనింగ్‌లో పాల్గొననున్నట్లు ఆ ఫ్రాంఛైజీ పేర్కొంది.  

రాబోయే సీజన్‌కు సన్నద్ధమయ్యేందుకు 38ఏండ్ల ధోనీ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాధన చేయనున్నాడు. ఇప్పటికే ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు సురేశ్‌ రైనా, అంబటి రాయుడు గత మూడు వారాల నుంచి శిక్షణలో పాల్గొంటున్నారు.  కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు, సారథి ధోనీ మధ్య ఒక అవగాహనకు వచ్చేందుకు ప్రాక్టీస్‌ సెషన్‌ ఉపయోగపడుతుందని సీఎస్‌కే యాజమాన్యం చెబుతోంది. మార్చి 29న చెన్నై  సూపర్‌ కింగ్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభంకానుంది. 
logo