శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 02, 2020 , 16:55:29

ఐపీఎల్ చరిత్రలో.. ధోనీ నయా రికార్డ్

ఐపీఎల్ చరిత్రలో.. ధోనీ నయా రికార్డ్

దుబాయ్:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)  చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మరో అరుదైన ఘనత అందుకోబోతున్నాడు.  శుక్రవారం రాత్రి చెన్నై, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి.   హైదరాబాద్‌తో  మ్యాచ్‌ ధోనికి 194వ ఐపీఎల్‌ మ్యాచ్‌.   ఇప్పటి వరకు మహీ 193 మ్యాచ్‌లు ఆడాడు.   ఐపీఎల్‌లో ఇప్పటి వరకు  ధోనీ, సురేశ్‌ రైనా 193 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు.

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ధోనీ   ఐపీఎల్‌లో  అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతను   సాధించనున్నాడు.  వ్యక్తిగత కారణాలతో రైనా ఐపీఎల్‌-13వ  సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.  ఐపీఎల్‌ 2008 సీజన్‌ నుంచి  ప్రాంఛైజీ ఆడిన ప్రతీ ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ చెన్నై  జట్టుకు  ధోనీ సారథ్యం వహించాడు. అతని కెప్టెన్సీలోనే చెన్నై 163 మ్యాచ్‌ల్లో 100 విజయాలు నమోదు చేసింది. 2016, 2017 సీజన్లలో ధోనీ రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

2016లో పుణె జట్టుకు కెప్టెన్‌గా  వ్యవహరించాడు.  రెండేళ్ల నిషేధం తర్వాత  మళ్లీ చెన్నై టీమ్‌లో చేరిన ధోనీ 2018 టైటిల్‌ విజేతగా  నిలిపాడు.  మహీ నాయకత్వంలో ప్రతీ సీజన్‌లోనూ చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరుకోవడం విశేషం. చరిత్రలో ఎనిమిది ఫైనల్స్‌ ఆడిన ఎల్లో ఆర్మీ మూడు సార్లు టైటిల్‌ నెగ్గింది.