శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 18, 2020 , 22:20:44

ఐపీఎల్​: బెస్ట్ కెప్టెన్లుగా ధోనీ, రోహిత్​.. బ్యాట్స్​మన్​, బౌలర్ వీరే..

ఐపీఎల్​: బెస్ట్ కెప్టెన్లుగా ధోనీ, రోహిత్​.. బ్యాట్స్​మన్​, బౌలర్ వీరే..

ముంబై: ఐపీఎల్ ఆల్​టైమ్​ బెస్ట్ కెప్టెన్లుగా మహేంద్ర సింగ్​ ధోనీ(చెన్నై సూపర్ కింగ్స్​​), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్​) ఎంపికయ్యారు. 20 మంది మాజీ క్రికెటర్లు, 10మంది సీనియర్ స్పోర్ట్స్​ జర్నలిస్టులతో స్టార్​ స్పోర్ట్స్​ ఏర్పాటు చేసిన జ్యూరీ.. ఐపీఎల్​లో వివిధ విభాగాలకు అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేసింది. ఐపీఎల్ ఆల్​టైమ్ అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్​, బెస్ట్​ బౌలర్​గా ముంబై ఇండియన్స్ యార్కర్ కింగ్​ లసిత్ మలింగ నిలిచారు.

బెస్ట్ ఆల్​రౌండర్​గా చెన్నై సూపర్​ కింగ్స్ ఆటగాడు ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ షేన్ వాట్సన్​, బెస్ట్ కోచ్​గా అదే జట్టుకు చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్​ ఎంపిక కాగా, భారత అత్యుత్తమ బ్యాట్స్​మన్​ స్థానాన్ని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. 

ఇదీ చదవండి: టీ20 క్రికెట్​లో విప్లవం: ఐపీఎల్​కు పుష్కరం


logo