బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 09, 2020 , 11:10:54

ధోని బైక్ రైడ్..వీడియో వైరల్‌

ధోని బైక్ రైడ్..వీడియో వైరల్‌

రాంచి: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మంగళవారం 39వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు.  మహీ  జన్మదినం సందర్భంగా సహచర క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు  సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.  కరోనా నేపథ్యంలో క్రికెట్‌ ఈవెంట్లు నిలిచిపోవడంతో  ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. 

ధోనికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. మంగళవారం తన బర్త్‌ డే సందర్భంగా ఫామ్‌హౌజ్‌లో బైక్‌పై చక్కర్లు కొట్టాడు.   మహీ కనబడితే జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని కొంతమంది అభిమానులు   తన ఇంటి గేటు వద్ద వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ధోనీ బైక్‌పై వచ్చి  ఫ్యాన్స్‌  వైపు చూస్తూ అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌ కూల్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo