బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 02, 2020 , 17:51:44

‘ఎల్లో ఆర్మీ’ vs ‘ఆరెంజ్‌ ఆర్మీ ’.. గెలుపెవరిదో !

‘ఎల్లో ఆర్మీ’  vs  ‘ఆరెంజ్‌ ఆర్మీ ’..  గెలుపెవరిదో !

దుబాయ్:ఐపీఎల్‌-13 సీజన్‌లో శుక్రవారం మరో ఆసక్తికర పోరు జరగనుంది.  అత్యంత పటిష్ఠంగా కన్పిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.   ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో సన్‌రైజర్స్‌ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది.  వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై సుమారు వారం రోజుల విరామం తర్వాత బరిలో దిగుతున్నది. 

విలియమ్సన్‌ రాకతో సన్‌రైజర్స్‌ మిడిలార్డర్‌ బలంగా తయారైంది. గత మ్యాచ్‌లోనూ అతడు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయగా..బౌలర్లు భువనేశ్వర్‌, నటరాజన్‌, రషీద్‌ ఖాన్‌ ఫామ్‌లో ఉన్నారు. గాయాల నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన చెన్నై కీలక ఆటగాళ్లు అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావో ఇవాళ హైదరాబాద్‌తో పోరుకు రెడీగా ఉన్నారు.

వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా విఫలమైన మురళీ విజయ్‌  స్థానంలో రాయుడు తుది జట్టులోకి రానుండగా శామ్‌ కరన్‌ స్థానంలో బ్రావోకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వరుసగా  రెండు ఓటములతో  ఢీలాపడిన ఎల్లో ఆర్మీ,  ఢిల్లీపై  ‌ విక్టరీతో ఫుల్‌‌  జోష్‌‌లో ఉన్న ఆరెంజ్‌ ఆర్మీ మధ్య  జరిగే బిగ్‌ఫైట్‌లో గెలుపెవరిదో?