మంగళవారం 09 మార్చి 2021
Sports - Jan 24, 2021 , 16:11:47

ఐపీఎల్‌-2021.. ఆ ముగ్గురిపైనే చెన్నై కన్ను

ఐపీఎల్‌-2021.. ఆ ముగ్గురిపైనే చెన్నై కన్ను

చెన్నై: రాబోయే ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం ఫిబ్రవరిలో మినీ ఐపీఎల్‌ వేలాన్ని నిర్వహించనున్నారు. జనవరి  20తోనే ఐపీఎల్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా  ఆయా  ఫ్రాంఛైజీలు  పలువురు ఆటగాళ్లను కూడా  వదులుకున్నాయి. జట్ల మధ్య ప్లేయర్ల  ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4న ముగియనుంది. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ 18 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నది. కేదార్‌ జాదవ్‌, మురళీ విజయ్‌, హర్భజన్‌ సింగ్‌, పియూశ్‌ చావ్లా, మోనూ సింగ్‌, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన షేన్‌ వాట్సన్‌లను ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది.  

రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు వదులుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు  స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లను   వేలంలో ఎలాగైనా చెన్నై దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.  సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్పను చెన్నై ట్రేడింగ్‌ విండో ద్వారా కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు   ఐపీఎల్‌లో ఆడని ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌  డేవిడ్‌ మలన్‌ను కూడా దక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. పొట్టిక్రికెట్లో అతనికి మంది రికార్డు ఉంది. ఐసీసీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాట్స్‌మన్‌గా మలన్‌ కొనసాగుతున్నాడు. వాట్సన్‌ స్థానాన్ని మలన్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది.   స్టీవ్‌ స్మిత్‌తో  మిడిలార్డర్‌ను చెన్నై బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. 

VIDEOS

logo