శుక్రవారం 03 జూలై 2020
Sports - May 21, 2020 , 17:48:43

ధోనీ స్థానాన్ని భర్తీ చేయడమా..!

ధోనీ స్థానాన్ని భర్తీ చేయడమా..!

లోకేశ్‌ రాహుల్‌ పార్ట్‌టైమ్‌ కీపరే అన్న మహమ్మద్‌ కైఫ్‌


న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్‌లో మహేంద్రసింగ్‌ ధోనీనే నంబర్‌వన్‌ వికెట్‌ కీపర్‌ అని.. అతడిని జట్టు నుంచి దూరం చేయడం మంచిదికాదని భారత మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ వ్యాఖ్యానించాడు. లోకేశ్‌ రాహుల్‌ ధీర్ఘకాల కీపర్‌గా మనగలడని తాను భావించడం లేదని కైఫ్‌ పేర్కొన్నాడు. పార్ట్‌టైమర్‌గా, స్టాండ్‌బైగా అయితే సరే కానీ కెరీర్‌ ఆసాంతం అతడికి బాధ్యతలు అప్పగించడం సరైంది కాదని కైఫ్‌ అన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ అనంతరం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో దుమ్మురేపి తిరిగి పొట్టి ప్రపంచకప్‌ బరిలో నిలుస్తాడని అంతా భావిస్తే.. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. 


‘ధోనీ ఏడాదిగా ఆటకు దూరంగా ఉన్నాడు.. ఐపీఎల్‌లో సత్తాచాటితేనే జాతీయ జట్టులోకి వస్తాడని అంతా భావిస్తున్నారు. నా వరకైతే అవేవీ అవసరం లేదు. ధోనీ ఫిట్‌నెస్‌ గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. అతడు నాణ్యమైన ఆటగాడు. జట్టు గెలుపునకు అహర్నశలు కృషిచేసే ఆటగాడు అతడు. ఒత్తిడిలో బ్యాటింగ్‌ చేయాల్సిన ఆరు, ఏడు స్థానాల్లో అతడు సరిగ్గా సరిపోతాడు. ఎంత మంది ఆటగాళ్లు వచ్చిన ధోనీని భర్తీ చేయలేరు. చాలా మంది ఆటగాళ్లు ధోనీ స్థానంలోకి వద్దామని ఊహిస్తుంటారు. కేఎల్‌ రాహుల్‌ను దీర్ఘకాలిక కెప్టెన్‌గా భావించడం లేదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో స్టాండ్‌బై కీపర్‌గా లోకేశ్‌ ఫర్వలేదు కానీ, అతడే పూర్తిస్థాయి కీపర్‌ అంటే కష్టమే’ అని కైఫ్‌ చెప్పుకొచ్చాడు.  


logo