మంగళవారం 07 జూలై 2020
Sports - Jun 29, 2020 , 21:40:54

ధోనీకే ప‌ట్టం..

ధోనీకే ప‌ట్టం..

త‌న ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవ‌న్ జ‌ట్టుకు సార‌థిగా ఎంచుకున్న ఆకాశ్ ‌చోప్రా

న్యూఢిల్లీ:  భార‌త మాజీ ఓపెన‌ర్ ఆకాశ్ చోప్రా ప్ర‌క‌టించిన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవ‌న్ జ‌ట్టులో కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేశాడు. లీగ్‌లో విజ‌య‌వంత‌మైన సార‌థిని త‌న జ‌ట్టు ప‌గ్గాలు అప్ప‌చెప్తున్నాన‌ని చోప్రా సోమ‌వారం పేర్కొన్నాడు. ఆకాశ్‌వాణి కార్య‌క్ర‌మంలో చోప్రా మాట్లాడుతూ.. మ‌హీని మించిన నాయ‌కుడు మ‌రొక‌రు ఉండ‌ర‌ని అన్నాడు. ఓపెన‌ర్లుగా హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మతో పాటు ఆస్ట్రేలియా హిట్ట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌కు చాన్స్ ఇచ్చిన చోప్రా.. వ‌న్‌డౌన్‌లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓటేశాడు. 

సురేశ్ రైనా, ఏబీ డివిలియ‌ర్స్‌, మ‌హేంద్ర‌సింగ్ ధోనీల‌ను మిడిలార్డ‌ర్ కోసం ఎంపిక చేసిన చోప్రా.. పేస్ ఆల్‌రౌండ‌ర్ల‌కు త‌న జ‌ట్టులో చోటు క‌ల్పిచ‌లేదు. స్పిన్ ఆల్‌రౌండ‌ర్లుగా హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, సునీల్ న‌రైన్‌ను ఎంపిక చేశాడు. పేస్ విభాగానికి వ‌స్తే.. భార‌త బౌల‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌తో పాటు శ్రీ‌లంక వెట‌ర‌న్ పేస‌ర్ ల‌సిత్ మ‌లింగ‌కు జ‌ట్టులో చోటు క‌ల్పించాడు. ఎక్స్‌ట్రా ప్లేయ‌ర్స్‌గా గౌత‌మ్ గంభీర్‌, ఆండ్రూ ర‌స్సెల్‌ను ఎంపిక చేయ‌డం విశేషం. 


logo