మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 09, 2020 , 23:51:45

ఐపీఎల్‌లో రాణిస్తేనే..

 ఐపీఎల్‌లో రాణిస్తేనే..

రాజ్‌కోట్‌: ఐపీఎల్‌ టోర్నీలో రాణిస్తేనే.. ధోనీకి జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.  నూతన చైర్మన్‌ సునీల్‌ జోషి సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీ ధోనీ భవిష్యత్తుపై ప్రస్తుతమున్న పరిస్థితిని కొనసాగించేందుకు  మొగ్గుచూపింది. ‘దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడం మినహా ధోనీ గురించి భేటీలో చర్చకు రాలేదు. ఐపీఎల్‌లో రాణిస్తేనే..అతనికి తిరిగి జట్టులో చోటు దక్కుతుంది. అతని ఒక్కనికే కాదు సీనియర్లు, జూనియర్లన్న తేడా లేకుండా ఎవరూ రాణించినా ఎంపికవుతారు’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి అన్నాడు. 


logo
>>>>>>