శుక్రవారం 29 మే 2020
Sports - Apr 07, 2020 , 23:26:50

‘ధోనీ.. పబ్​జీ నుంచి కొత్త గేమ్​కు మారాడు’

‘ధోనీ.. పబ్​జీ నుంచి కొత్త గేమ్​కు మారాడు’

న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొబైల్​లో పబ్​జీ గేమ్​ ఆడడం దాదాపు మానేశాడని పేసర్ దీపక్ చాహర్ అన్నాడు. తాను ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న కారణంగా పబ్​జీ అధికంగా ఆడుతున్నానని చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ఇంటర్వ్యూలో చాహర్ చెప్పాడు . ఐపీఎల్​లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చాహర్ ప్రధాన బౌలర్​గా ఎదిగిన సంగతి తెలిసిందే.

“నేను స్వీయ నిర్బంధంలో ఉండడంతో పబ్​జీ గేమ్ ఎక్కువగా ఆడుతున్నా. గతంలో ధోనీ కూడా ఆ గేమ్ బాగా ఆడేవాడు. కానీ ఇప్పడు కాదు. అతడు కాల్ ఆఫ్ డ్యూటీ(సీవోడీ) గేమ్​కు మారాడు. ఈ మధ్య కాలంలో ఓ సారి మళ్లీ పబ్​జీలోకి వచ్చాడు. అయితే సీవోడీ ఎక్కువగా ఆడడంతో పబ్​జీపై ధోనీకి పట్టు పోయింది. సరిగా అర్థం చేసుకోలేకపోయాడు” అని దీపక్ చాహర్ చెప్పాడు.  


logo