పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రం వకీల్ సాబ్. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు ఉదయం దిల్ రాజు బెనిఫిట్ షోని చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు.
వకీల్ సాబ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కాదు అంటే నాగార్జునతో చేయాలని అనుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఆప్షన్‌గా నాగార్జున ని అనుకున్నామని వేణు శ్రీరాం పేర్కొన్నారు. వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు- బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. అనన్య నాగళ్ల, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషించగా, శృతి హాసన్ కథానాయికగా నటించింది.