సోమవారం 13 జూలై 2020
Sports - May 28, 2020 , 19:59:17

ధోనీకి చెప్పాల్సిన అవసరం లేదు: గ్యారీ

ధోనీకి చెప్పాల్సిన అవసరం లేదు: గ్యారీ


న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై జరుగుతున్న చర్చ అనవసరమైనదని మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ అన్నాడు. ఆటకు ఎప్పుడు వీడ్కోలు పలకాలో నిర్ణయం తీసుకోవాల్సింది మహీనే అని అలాంటి అంశంపై ఇతరుల జోక్యం అవసరం లేదని గ్యారీ పేర్కొన్నాడు. తన నిర్ణయాన్ని ప్రకటించే అర్హత అతడు సంపాదించుకున్నాడని. అతడు అద్భుతమైన ఆటగాడని గ్యారీ చెప్పుకొచ్చాడు. 2011 ప్రపంచకప్‌ తన జీవితంలో ఎన్నో మధుర అనుభూతులను మిగిల్చిందని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. 

‘ధోనీ అద్భుతమైన ఆటగాడు. అతడు మ్యాచ్‌ను చాలా వేగంగా అర్థం చేసుకోగలడు. ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటాడు. ఆధునిక క్రికెట్‌లో అతడు అత్యుత్తమ ఆటగాడు అనడంలో సందేహం లేదు. తనకు ఇష్టమైనప్పుడే ఆటకు వీడ్కోలు ప్రకటించే హక్కును మహీ సంపాదించుకున్నాడు. సమయం ఆసన్నమైందని అతడినెవరూ ఆదేశించాల్సిన అవసరం లేదు’ అని గ్యారీ అన్నాడు. సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి పనిచేయడం చాలా సులభమని.. అతడు విలువలతో కూడిన వ్యక్తి అని గ్యారీ పేర్కొన్నాడు.  


logo