శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 24, 2020 , 01:25:10

బిజినెస్‌ క్లాస్‌ సీటు వదులుకుని... ఎకానమీలో ప్రయాణించిన ధోనీ

బిజినెస్‌ క్లాస్‌ సీటు వదులుకుని... ఎకానమీలో ప్రయాణించిన ధోనీ

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మరోమారు గొప్ప మనసు చాటుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా ఉంటూ కెప్టెన్‌ కూల్‌ పేరును సార్థకం చేసుకున్నాడు. ఐపీఎల్‌ కోసం దుబాయ్‌కి శుక్రవారం ప్రత్యేక విమానంలో ధోనీసేన బయల్దేరి వెళ్లింది. కెప్టెన్‌ హోదాలో ధోనీకి చెన్నై యజమాన్యం బిజినెస్‌ క్లాస్‌ సీటు కేటాయించింది. అయితే ఇదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎస్‌కే డైరెక్టర్‌ జార్జ్‌ జాన్‌..ఎకానమీ క్లాస్‌లో పడుతున్న ఇబ్బందిని మహీ గుర్తించాడు. తనకు కేటాయించిన సీటులో జాన్‌ను కూర్చోమని సహచరులతో కలిసి ఎకానమీలో ప్రయాణించాడు. తన పట్ల మహీ కనబరిచిన సహృదయతను జాన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు.ధోనీ గొప్పతనానికి ఫిదా అయిన అభిమానులు సందేశాలతో ముంచెత్తారు. 


logo