మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 20, 2020 , 14:54:14

200 ఐపీఎల్‌ జెర్సీ..బట్లర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన ధోనీ

200 ఐపీఎల్‌ జెర్సీ..బట్లర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన ధోనీ

అబుదాబి: టీమిండియా మాజీ కెప్టెన్‌  మహేంద్ర సింగ్‌ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది  అభిమానులున్నారు.  దశాబ్దకాలంలో  ఎంతో మంది క్రికెటర్లకు ధోని స్ఫూర్తిగా నిలిచాడు.  కెప్టెన్‌ కూల్‌ ధోనీని  ఆరాధించే క్రికెటర్లలో ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌  కూడా ఒకడు.  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో  జోస్‌ బట్లర్‌ ( 70 నాటౌట్‌: 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు )    అద్భుత ఇన్నింగ్స్‌తో   రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

మ్యాచ్‌ అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు తన క్రికెట్‌ హీరో నుంచి  బట్లర్‌ ఊహించని బహుమతి అందుకున్నాడు.   ఐపీఎల్‌లో ధోనీ ఆడిన 200 మ్యాచ్‌ జెర్సీని అతడు గిఫ్ట్‌గా స్వీకరించాడు. అతిపెద్ద అభిమానుల్లో ఒకడైన బట్లర్‌కు 200 ఐపీఎల్‌ మ్యాచ్‌లో ధరించిన ప్రత్యేక జెర్సీని ధోనీ  బహుమతిగా ఇచ్చాడు.  దీంతో మహీ నుంచి స్వీకరించిన జెర్సీని ఐపీఎల్‌ అధికారిక ట్విటర్లో పోస్ట్‌ చేసింది.   గతంలో టీమిండియా జెర్సీపై సంతకం చేసిన టీషర్ట్‌ను బట్లర్‌  కూడా అందుకున్న విషయం తెలిసిందే.  ధోని తన 200వ ఐపీఎల్‌   మ్యాచ్ జెర్సీని బహుమతిగా ఇవ్వడంపై బట్లర్‌ సంతోషం వ్యక్తం చేశాడు.