శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 04:18:58

ధోనీ ప్రాక్టీస్‌ షురూ

 ధోనీ ప్రాక్టీస్‌ షురూ

చెన్నై: ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. సోమవారం ఇక్కడి ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి  బ్యాట్‌పట్టాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ధోనీ అలరించాడు. అతడితో పాటు అంబటి రాయుడు, మురళీ విజయ్‌, మరికొందరు ప్లేయర్లు ప్రాక్టీస్‌ చేశారు. 
logo