మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 13, 2020 , 18:28:30

ఇది చెన్నై జెర్సీ రంగుల ‘ఇళ్లు ’

ఇది చెన్నై  జెర్సీ  రంగుల ‘ఇళ్లు ’

చెన్నై: ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్‌ తొలి సీజన్‌ నుంచి ఆ జట్టుకు ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటంతో తమిళనాడుతో పాటు దేశంలోని మిగతా ప్రాంతాల క్రికెట్‌ అభిమానులు సీఎస్‌కేను ఆదరిస్తున్నారు.  తాజాగా ధోనీ   డైహార్డ్‌ ఫ్యాన్‌ ఒకరు తన ఇంటికి చెన్నై టీమ్‌ జెర్సీ రంగులను వేయించాడు.

తమిళనాడులోని కడలూరుకు చెందిన ఎల్లో  ఆర్మీ సూపర్‌ ఫ్యాన్‌ గోపీ కృష్ణన్‌  తన ఇళ్లుకు  చెన్నై జెర్సీ రంగులు వేయించడంతో పాటు ఆ జట్టు లోగో, ధోనీ ఫొటోలను ఇంటి గోడలపై పెయింటింగ్‌ చేయించాడు.    అలాగే  నివాస గృహానికి  'హోమ్‌ ఆఫ్‌ ధోనీ ఫ్యాన్'‌ అని కూడా పేరు పెట్టడం విశేషం. ఆ ఇంటికి రంగులు వేయించేందుకు గోపీ కృష్ణన్‌ రూ.1.5లక్షలు వెచ్చించాడు.    ప్రస్తుతం ఆ ఇంటి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.