ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 13, 2021 , 02:58:04

తెలంగాణలో ధోనీ క్రికెట్‌ అకాడమీ

తెలంగాణలో ధోనీ క్రికెట్‌ అకాడమీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: అత్యుత్తమ క్రికెట్‌ శిక్షణా సౌకర్యాలు త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. ప్రతిభ కల్గిన క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కల్పించడంలో భాగంగా తెలంగాణలో ఎమ్‌ఎస్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీలు ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక(బెంగళూరు మినహా) రాష్ర్టాల్లో అకాడమీల ఏర్పాటుకు ఆర్కా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో బ్రెనియాక్స్‌ బీ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఏప్రిల్‌లో బల్లారీ వద్ద తొలి అకాడమీని ప్రారంభించనున్నారు. ఆర్కా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ భాగస్వామ్యంలో భాగంగా రానున్న రోజుల్లో హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో అత్యుత్తమ శిక్షణ వసతులు ఏర్పాటు చేయనున్నారు. క్రికెట్‌ కోచింగ్‌లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కల్గిన ఆర్కా స్పోర్ట్స్‌ శిక్షణా పద్ధతులను దిగ్గజ ధోనీ తీర్చిదిద్దాడు. ఈ విధానాలను కోచింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ డారిల్‌ కలినాన్‌ అమలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే క్రికెట్‌ అకాడమీతో పాటు స్కూల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని బ్రెనియాక్స్‌ బీ అమలు చేయనుంది. దీని ద్వారా పాఠశాలల్లో అత్యుత్తమ శిక్షణా ప్రమాణాలను అభివృద్ధి చేయడం, ప్రతిభ కల్గిన వారిని గుర్తించడం జరుగుతుంది. 

VIDEOS

logo