ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 12, 2021 , 18:54:05

తెలంగాణలో ధోనీ క్రికెట్‌ అకాడమీ .. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్.. బ్రెయినియాక్స్‌ బీతో కుదిరిన ఒప్పందం

తెలంగాణలో ధోనీ క్రికెట్‌ అకాడమీ .. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్.. బ్రెయినియాక్స్‌ బీతో కుదిరిన ఒప్పందం

హైదరాబాద్‌: తెలంగాణ యువతకు  శుభవార్త. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక క్రికెట్‌ అకాడమీ హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతోంది. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తెలంగాణలో క్రికెట్‌ అకాడమీ ప్రారంభించబోతున్నాడు. ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ పేరుతో అకాడమీని నెలకొల్పబోతున్నాడు. ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ..బ్రెయినియాక్స్‌ బీతో శుక్రవారం ఒప్పందం చేసుకున్నది.  రాబోయే రెండేండ్లలో కనీసం 15 అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

భారత మాజీ అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు సభ్యుడు, ఆర్కా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌  మిహిర్ దివాకర్ ఒప్పందానికి సంబందించిన వివరాలు వెల్లడించాడు. ఈ అకాడమీ తనతో పాటు ధోనీ మానసపుత్రిక అని అన్నాడు. 

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ కెరీర్‌ ప్రారంభంలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే రెండేండ్లలో తెలంగాణతో పాటు  కర్ణాటక(బెంగళూరు మినహాయించి), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కనీసం 20-25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దివాకర్‌ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో  మొదటి అకాడమీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బళ్లారిలో మొదలుకానుందని చెప్పారు.

ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ కోచింగ్‌ డైరెక్టర్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ డారెల్‌ కలినన్‌ కొనసాగుతున్నారు. భారత్‌లో ఇప్పటికే 50కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో మూడింటిని ప్రారంభించారు.  ధోనీ ఎడ్యూకేషన్‌ విభాగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే జూన్‌ నుంచి బెంగళూరులో ఎంఎస్‌ ధోనీ గ్లోబల్‌ స్కూల్‌ కూడా ప్రారంభించనున్నారు.   

VIDEOS

logo