సోమవారం 26 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 16:22:55

IPL 2020: అరుదైన రికార్డుకు చేరువలో ధోనీ

IPL 2020: అరుదైన రికార్డుకు చేరువలో ధోనీ

దుబాయ్: చెన్నై సూపర్‌ కింగ్స్‌  సారథి  మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.  ప్రపంచ క్రికెట్లో బెస్ట్‌ ఫినిషర్‌గా పేరొందిన ధోనీ ఎవరి బౌలింగ్‌లోనైనా అలవోకగా  భారీ సిక్సర్లు బాదేస్తాడు.    ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును    చెన్నై ఢీకొంటున్నది.  ఈ  మ్యాచ్‌లో మహీ మరో  రెండు  సిక్సర్లు  బాదితే  టీ20  క్రికెట్‌లో 300  సిక్సర్ల  మార్క్‌ అందుకుంటాడు.  

ఇప్పటికే సీనియర్‌ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా,  ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 300 సిక్సర్ల  క్లబ్‌లో ఉన్నారు.  ధోనీ 300 సిక్సర్ల  ఫీట్‌ను  అందుకుంటే ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.  పొట్టి క్రికెట్‌లో ఇప్పటి వరకు ధోనీ 298 సిక్సర్లు బాదాడు.  ఒక్క ఐపీఎల్‌లోనూ ధోనీ 192 మ్యాచ్‌ల్లో 212 సిక్సర్లు కొట్టాడు.  క్రిస్‌గేల్‌(326 సిక్సర్లు), డివిలియర్స్‌(214) జాబితాలో ముందున్నారు. 

ఐపీఎల్‌లో ఒకే జట్టుకు సారథిగా వ్యవహరిస్తూ  100  విజయాలు అందించిన తొలి కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. అలాగే టీ20 క్రికెట్‌లో  250 క్యాచ్‌లు అందుకున్న తొలి, ఏకైక కీపర్‌గానూ అరుదైన ఘనత అందుకున్నాడు.logo