సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 17:42:26

రఫేల్ యుద్ధ విమానాలపై ధోనీ ఏమన్నారంటే..!

రఫేల్ యుద్ధ విమానాలపై ధోనీ ఏమన్నారంటే..!

దుబాయ్‌: అత్యంత అధునాతన  రఫేల్‌ యుద్ధ విమానాలు భారత వైమానిక దళ అమ్ములపొదిలో ఇవాళ అధికారికంగా  చేరాయి.   రఫేల్‌ రాకతో  వాయుసేన సామర్థ్యం మరింత బలోపేతం అయిందని  టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు.   గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్ ధోనీ  రఫేల్‌ సామర్థ్యంపై ట్విటర్లో  స్పందించాడు. 

'రఫేల్‌ ఫైనల్‌ ఇండక్షన్‌ వేడుకతో ప్రపంచపు అత్యుత్తమ యుద్ధ విమానంగా నిరూపితమైన 4.5 జనరేషన్‌ యుద్ధ విమానం  ప్రపంచంలోని  అత్యుత్తమ ఫైటర్‌ ఫైలట్ల చేతుల్లోకి వెళ్తుంది.  మన ఫైలట్ల చేతుల్లో  ఐఏఎఫ్‌లోని వేర్వేరు ఎయిర్‌క్రాఫ్ట్‌ల కలయికతో   వాయిసేన సామర్య్థాన్ని మరింత పటిష్టంగా మారుస్తాయి.  17వ స్వ్కాడ్రన్‌(గోల్డెన్‌ యారోస్‌)కు ఆల్‌ ది వెరీ బెస్ట్‌. మిరాజ్‌ 2000 సర్వీస్‌ రికార్డును రఫేల్‌ అధిగమిస్తుందని   భావిస్తున్నాం. కానీ ఎప్పటికైనా సుఖోయ్‌ 30MKI  విమానమే నా ఫేవరెట్‌.   ఇవి సూపర్‌ సుఖోయ్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యే వరకు బీవీఆర్‌ ఎంగేజ్‌మెంట్‌ కోసం వేచిచూడాలంటూ' ధోనీ ట్విటర్లో పేర్కొన్నాడు. 


logo