మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 19, 2020 , 00:00:36

ఐపీఎల్‌ @57 రోజులు

ఐపీఎల్‌ @57 రోజులు
  • 13వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల.. చెన్నై, ముంబై మధ్య తొలి మ్యాచ్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వంటి ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్లు ఆడనున్న మ్యాచ్‌లను ట్విట్టర్‌ ద్వారా విడుదల చేయగా.. మంగళవారం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 29న ప్రారంభమయ్యే ఈ సీజన్‌ మే 24తో ముగియనుంది. ఇప్పటి వరకు నిర్వహించిన అన్నీ సీజన్‌లతో పోలిస్తే ఈసారి ఐపీఎల్‌ సుదీర్ఘంగా (57 రోజుల పాటు) సాగనుంది. 2019 సీజన్‌ 51 రోజల్లో ముగియగా.. 13వ సీజన్‌ మరో ఆరు రోజులు ఎక్కువ జరుగనుంది. వారాంతాల్లో రెండు మ్యాచ్‌ల ఆనవాయితీకి స్వస్తి పలికిన నిర్వాహకులు.. ఆదివారం మాత్రమే ‘డబుల్‌ మ్యాచ్‌'లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 


అయితే ఆట ఆరంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఎప్పట్లాగే మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకే ప్రారంభం కానున్నాయి. రెండు మ్యాచ్‌లు జరుగనున్న ఆరు ఆదివారాలు మాత్రమే తొలి మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. 7.30 గంటలకే మ్యాచ్‌లు మొదలవుతాయని వార్తలొచ్చినా.. నిర్వాహకులు వాటిని కొట్టిపారేశారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు సొంతగడ్డపై 7.. ఇతర వేదికలపై ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. వాంఖడేలో  జరుగున్న లీగ్‌ ఆరంభం మ్యాచ్‌లో గతేడాది ఫైనల్‌ ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌లో సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. 


logo
>>>>>>