గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 07, 2020 , 10:17:49

ధోనీ ప్రాక్టీస్‌ షురూ!

ధోనీ  ప్రాక్టీస్‌ షురూ!

రాంచీ:  గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. వచ్చే నెల 19 నుంచి  యూఏఈ వేదికగా  ఐపీఎల్‌-13 సీజన్‌  మొదలవుతున్న నేపథ్యంలో  చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌  మహీ  ప్రాక్టీస్‌ ప్రారంభించాడు.  ధోనీ తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు.

'గత వారం  జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌కు ధోనీ వచ్చాడు.  ఇండోర్‌ స్టేడియంలో బౌలింగ్‌ మెషిన్‌ను  ఉపయోగించి బ్యాటింగ్‌ సాధన చేశాడని' ఝార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్‌ ఒకరు తెలిపారు. 

'అతని  ప్రణాళికలు ఏమిటో, అతను ప్రాక్టీస్‌ కోసం మళ్లీ ఇక్కడికి వస్తాడో లేదో నాకు నిజంగా తెలియదు.  సాధన కోసం ఇక్కడి రావడంతోనే ఆ విషయం మాకు తెలిసిందని' అధికారి చెప్పారు. అన్ని  ఐపీఎల్‌ జట్లు కూడా ఆగస్టు 20 తర్వాత దుబాయ్‌  వెళ్తాయి.  logo