మంగళవారం 14 జూలై 2020
Sports - May 11, 2020 , 20:36:17

‘ధోనీ వాదించడం చూసి ఆశ్చర్యపోయా’

‘ధోనీ వాదించడం చూసి ఆశ్చర్యపోయా’

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన ఓ మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు. చెన్నై చివరి మూడు బంతులకు ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా.. రాయల్స్ బౌలర్ స్టోక్స్​ ఫుట్​టాస్ వేశాడు. దాన్ని నోబాల్​గా ప్రకటించేందుకు సిద్ధమైన అంపైర్​ చివరికి నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాదించాడు. చివరి బంతికి సాంట్నర్ సిక్స్ కొట్టడంతో ఎట్టకేలకు ఆ మ్యాచ్​లో చెన్నై గెలిచింది. అయితే అప్పటి విషయాలను న్యూజిలాండ్ ఆల్​రౌండర్​, సీఎస్కే ఆటగాడు మిచెల్ సాంట్నర్​ తాజాగు గుర్తు చేసుకున్నాడు. ధోనీ అలా చేయడంతో తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యానని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.

“అందరిలాగే నేను కూడా చాలా ఆశ్యర్యపోయా. అతడు(ధోనీ) ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అయితే ఈ ఘటన అతడు జట్టు పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నాడో, టీమ్​ను కుటుంబంలా ఎంతలా ఫీలవుతున్నాడో చూపిందని నేను అనుకుంటున్నా. ధోనీది కోపం కాదు. అంపైర్ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమై చేయి ఎత్తి.. మళ్లీ వెనక్కితీసుకోకూడదు. అయితే ఇదంతా ముగిశాక ధోనీ అంపైర్లకు క్షమాపణ చెప్పాడు” అని సాంట్నర్ వెల్లడించాడు.

 


logo