శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 20:32:38

ధోనీ రిటైర్మెంట్‌కు కారణమిదేనా?

ధోనీ రిటైర్మెంట్‌కు కారణమిదేనా?

న్యూఢిల్లీ:   టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.  అత్యంత విజయవంతమైన సారథి మహీ   షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన  టీ-20 వరల్డ్ కప్ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగాలని భావించాడు.    ఆ గెలుపుతో క్రికెట్ జీవితం నుంచి నిష్క్రమించాలని అతను కోరుకున్నాడు.  ఐతే కరోనా వల్ల టీ20  వరల్డ్‌ కప్‌ వాయిదా పడటం, ఇప్పట్లో టీమ్‌ఇండియా వన్డే, టీ20 సిరీస్‌లో తలపడే అవకాశాలు లేకపోవడంతో మహీ  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

సెప్టెంబర్‌ 19న ఐపీఎల్‌-13 సీజన్‌ ఆరంభంకాబోతుండటంతో  స్వేచ్ఛగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా జట్టుకు మరోసారి టైటిల్‌ సాధించిపెట్టాలని ధోనీ భావిస్తున్నాడు.  ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా ధోనీ జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలను సెలక్టర్లు పరిగణిస్తారని, కుర్రాళ్ల కోసం ధోనీ తన  తన స్థానం నుంచి  తప్పుకోవాలని   గత కొద్దిరోజులుగా క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత క్రికెట్లో  ధోనీని మించిన ఫినిషర్ లేడని మాజీ క్రికెటర్లు   ప్రశంసిస్తున్నారు. 


logo